ఉరేసుకొని వ్యక్తి మృతి

CTR: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర్ తెలిపారు. వడ్డేపల్లెకు చెందిన బాలాజీ(44) శాంతినగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన మద్యం తాగి చిన్న వైరుతో ఉరేసుకొని మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.