యుద్ధం.. మరో భారతీయుడు మృతి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మరో భారతీయుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన దాడిలో అతను మరణించినట్లు ఆ దేశంలోని భారత ఎంబసీ వెల్లడించింది. దీంతో ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు చనిపోయిన భారతీయుల సంఖ్య 6కు చేరింది. మృతుని కుటుంబానికి సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది.