అక్రమ అరెస్టులకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముట్టడి
WNP: అక్షర స్కూల్‌లో మైనార్టీ బాలికపై జరిగిన అత్యాచారాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడానికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన నిందితున్ని, యాజమాన్యాన్ని కాపాడాలని కుట్ర చేస్తున్నారని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలన్నారు.