చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచంటే?
రేపు పుబ్బ నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మ.3:19కి ప్రారంభమై సా.6:46కి ముగుస్తుంది. గ్రహణ ప్రభావంతో తిరుమల, యాదగిరిగుట్ట, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాల ద్వారాలను మూసివేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సా.6 గంటల తర్వాత దీని ప్రభావం ఉంటుంది. మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాల వారు, సింహ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదని పండితులు సూచిస్తున్నారు.