సూర్యాపేటలో ఎన్నికల నియమావళిపై అవగాహన
సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ ఎన్నికల అభ్యర్థులకు వ్యయం, ప్రచార నియమాలపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి, ఎస్పీ నర్సింహ పాల్గొన్నారు. పరిమితికి మించి ఖర్చు చేయరాదని, క్రమశిక్షణ పాటించాలని పరిశీలకులు సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.