అక్రమంగా నల్ల మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

NRML: దిలావర్పూర్ మండలంలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు గోదావరి నదీ తీరం నుంచి తరలిస్తున్న నల్ల మట్టి టిప్పర్లను తహసీల్దార్ ఏజాజ్ హైమద్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం దిలావర్పూర్ పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా నల్లమట్టి తరలించడం చట్టరీత్యా నేరమని పట్టుబడిన టిప్పర్లను జిల్లా మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని వారు తెలిపారు