అభ్యర్థి గుర్తు మాయం.. నిలిచిన పోలింగ్

అభ్యర్థి గుర్తు మాయం.. నిలిచిన పోలింగ్

TG: వనపర్తి జిల్లా చిమనగుంటపల్లిలో 8వ వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పత్రంలో తనకు కేటాయించిన గ్యాస్ సిలిండర్ గుర్తు బ్యాలెట్‌లో లేదని అభ్యర్థి కేశమ్మ అభ్యంతరం తెలిపింది. దీంతో అధికారులు కొద్దిసేపు పోలింగ్ నిలిపివేసి కొత్త బ్యాలెట్లు తెప్పించి ఓటింగ్ కొనసాగించారు. అయితే అప్పటికే ఓటు వేసిన వాళ్ల పరిస్థితి ఏంటని అభ్యర్థి అధికారులను నిలదీసింది.