ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

అన్నమయ్య: చిన్నమండెం బోరెడ్డిగారిపల్లిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మంత్రిని సత్కరించారు.