FCI మాజీ సభ్యుడికి షాక్ ఇచ్చిన డీమార్ట్

FCI మాజీ సభ్యుడికి షాక్ ఇచ్చిన డీమార్ట్

AP: తిరుపతి స్థానిక డీమార్ట్‌లో FCI మాజీ సభ్యుడు ప్రదీప్‌కు వింత అనుభవం ఎదురైంది. ఆయన 1.2 కిలోల ఉద్ది పప్పు(మినపప్పు) కొనుగోలు చేయగా, బిల్లులో ఏకంగా రూ.2.899 వేశారు. ఇంటికెళ్లాక ఇది గమనించిన ఆయన స్టోర్ నిర్వాహకులను నిలదీయగా, పొరపాటు జరిగిందని వారు సమాధానమిచ్చారు. దీనిపై జాయింట్ కలెక్టర్, లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.