జలధార-జల హారతి' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కందుకూరు పట్టణంలో ఇవాళ నిర్వహించిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యాలయం వెనుక చెరువు వద్ద జరిగిన 'జలధార-జల హారతి' కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాలను పరిశీలించిన ఆయన, నీటి వనరుల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు.