బడంపేటలో మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం

బడంపేటలో మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం

SRD: కోహిర్ మండలం బడంపేట రాచన్న స్వామి మహా శైవ క్షేత్రంలో జిల్లా జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆరుద్ర నక్షత్రం, మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం ఆదివారం వైభవంగా జరిగాయి. భ్రమరాంబ సమేత రాచన్న స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థం, దేశం సుభిక్షంగా, పాడిపంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేశారు.