ప్రతి రైతుకు రసీదును తప్పనిసరిగా ఇవ్వాలి
MNCL: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మిన రైతులకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని రైతు జేఏసి మంచిర్యాల నియోజకవర్గ కన్వీనర్ గాది శ్రీనివాస్ కోరారు. ఇవాళ దండేపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.