'వైద్య సేవల్లో ఆశా వర్కర్లు పాత్ర కీలకం'
KMM: క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్యాధికారి డాక్టర్ అర్జున్ గౌతమ్ కొనియాడారు. నేలకొండపల్లి మండలం బోదుల బండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 'ఆశా డే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని మాట్లాడారు. గర్భిణీలు, బాలింతల సంరక్షణలో ఆశా వర్కర్లు సేవలు అభినందనీయమన్నారు.