'రెండు గ్రామాల మధ్య కల్వర్టు నిర్మించాలి'

SDPT: బేగంపేట, గూడెం నుంచి ఇల్లంతకుంట మండల తాళ్లపల్లి వెళ్లే రహదారిపై కల్వర్టు లేక భారీ వరదల కారణంగా రాకపోకలు ఆగిపోయాయి. గూడెం, బేగంపేట, తాళ్లపల్లి గ్రామాల రైతులు వ్యవసాయ క్షేత్రాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తక్షణమే స్పందించి కల్వర్టు నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.