పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు
అన్నమయ్య: మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు 3 జిల్లాలకు సెలవులు ప్రకటించింది. కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తూర్పు గోదావరి,అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చింది.