ప్రయాణికులకు ఎయిరిండియా అలర్ట్
దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రయాణికులకు ఎయిరిండియా అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షం, బలమైన గాలులతో చెన్నైకి రాకపోకలు సాగించే విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది. దక్షిణాదిన మరికొన్ని నగరాల విమానాలపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది. విమానాల సర్వీసులకు సంబంధించిన స్టాటస్‌ను అధికారిక వైబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించింది.