నందిగామలో వెహికల్ అండర్ పాస్ పనులు పూర్తి

నందిగామలో వెహికల్ అండర్ పాస్ పనులు పూర్తి

NTR: నందిగామ వై జంక్షన్ వద్ద వాహనదారుల కష్టాలకు తెరపడింది. నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో వెహికల్ అండర్‌ పాస్ పనులను అధికారులు పూర్తి చేశారు. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అండర్‌ పాస్ నిర్మించారు.