జర్నలిస్ట్‌పై కేసు ఎత్తివేయాలని సీపీకి వినతి

జర్నలిస్ట్‌పై కేసు ఎత్తివేయాలని సీపీకి వినతి

KMM: రిపోర్టర్ సాంబశివరావుపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదని ఆయన అన్నారు. వెంటనే జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన కోరారు.