మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతల స్వీకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి షరిపోద్దీన్ తంగళ్ళపల్లి మండల ప్రత్యేక అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు తంగళ్ళపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా ఆయనకు మొక్కను అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షరిపోద్దిన్ మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.