పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
సత్యసాయి: నల్లమాడ మండలంలోని చౌటుకుంటపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.7,030 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.