బాలీవుడ్ ఫేక్ ఇండస్ట్రీ: నటుడి తనయుడు

బాలీవుడ్ పనిచేయడానికి సరైన ప్లేస్ కాదంటూ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ చెప్పాడు. ఈ పరిశ్రమ ఎంతో అమర్యాదకరంగా ఉంటుందన్న అతను.. తాను చూసిన వాటిల్లో ఇదే ఫేక్ ఇండస్ట్రీ అని పేర్కొన్నాడు. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. డిలీట్ చేశాడు. కానీ ఆ వీడియో అప్పటికే నెట్టింట వైరల్‌గా మారింది.