భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
ASR: కూనవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య మరణాన్ని తట్టుకోలేక కంటయ్య అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం గుడిలో జరిగిన అగ్ని ప్రమాదంలో భార్య కృష్ణవేణి మృతి చెందడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఐస్ అమ్ముకుని జీవించే కంటయ్య, ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని ఎస్సై రామకృష్ణ తెలిపారు.