"బాలికలందరు HPV టీకాలు వేయించుకోవాలి"
WGL: కరీమాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం HPV టీకా పంపిణీ కార్యక్రమాన్ని 32 వ డివిజన్ కార్పొరేటర్ పద్మ-రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. మహిళల్లో వచ్చే క్యాన్సర్ల నివారణకు 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ ప్రభుత్వం అందిస్తున్న HPV టీకాలను వేయించాలని ఆమె తెలిపారు. బాలికల ఆరోగ్య రక్షణకు ఈ టీకా అత్యంత ముఖ్యమని అన్నారు.