పిహెచ్‌సీని తనిఖీ చేసిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి

పిహెచ్‌సీని తనిఖీ చేసిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి

AKP: మునగపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.హైమావతి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికీ ఆభా ఐడీలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని సూచించారు. వడదెబ్బపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.