VIDEO: కురవి ప్రభుత్వ పాఠశాలలో చోరీ

MHBD: కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రధానోపాధ్యాయులు వహీద్ కథనం ప్రకారం బీరువాలో ఉన్న క్రీడా సామాగ్రిని అపహరించుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై కురవి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.