ఉద్యమకారుల హామీల అమలుకు వినతి

ఉద్యమకారుల హామీల అమలుకు వినతి

KNR: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఉద్యమకారుల జిల్లా ఫోరం అధ్యక్షులు ఏక్కటి సంజీవరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో చర్చించి త్వరలోనే కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నట్లు ఏక్కటి పేర్కొన్నారు.