భీమారం యాదవ మహాసభ అధ్యక్షుడిగా మహేష్ యాదవ్
JGL: అఖిల భారత యాదవ మహాసభ భీమారం మండల నూతన అధ్యక్షుడిగా తొట్ల మహేష్ యాదవ్ ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని నియమించారు. ప్రధాన కార్యదర్శిగా జాల మల్లేశం యాదవ్, ఉపాధ్యక్షుడిగా భూపతి రంజిత్ యాదవ్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా దండిగా మనోజ్ యాదవ్ సహా ఐదుగురు ఎంపికయ్యారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.