బెల్లం ఊటలు ధ్వంసం

బెల్లం ఊటలు ధ్వంసం

PPM: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాలైన కర్లీ, మాణిక్యవలస గ్రామాల్లో ఏఈఎస్ సంతోశ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం దాడులు నిర్వహించారు. ఆంధ్ర-ఒడిశా ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించినట్లు సంతోశ్ కుమార్ తెలిపారు. సారా తయారీ కేంద్రాలను గుర్తించి 8000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. మొత్తం 4 కేసులు నమోదు చేశారు.