అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

BHNG: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన భూదాన్ పోచంపల్లి ఇవాళ చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన RTC బస్సు శివారెడ్డిగూడెం నుంచి ఇంద్రియాల మీదుగా భువనగిరికి వెళ్తుండ‌గా మరో ఆర్టీసీ బస్సు ఎదురుగా రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.