రేపు సరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రేపు సరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

W.G: నరసాపురం మండలం సరిపల్లిలో రేపు ఉదయం 11 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు ఏవో జ్యోషి తెలిపారు. సరిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ..ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.