గుండెపోటుతో సీపీఐ సీనియర్ నాయకుడి మృతి

గుండెపోటుతో సీపీఐ సీనియర్ నాయకుడి మృతి

KMR: జిల్లా సీపీఐ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది వి.ఎల్.నరసింహారెడ్డి నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. గత 40 ఏళ్లుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ఆయన అనేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల జిల్లాలోని అఖిలపక్ష నాయకులు, సీపీఐ నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.