ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
NGKL: కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గేటు జాతీయ రహదారి 167k పై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బైక్‌పై వెళుతున్న ఇద్దరినీ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బెక్కెర గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, శ్యామల రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.