గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన MAO
SRPT: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నడిగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి జి.మల్సూర్ స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ, స్టోర్ రూమ్, టాయిలెట్స్, ఆట స్థలాన్ని పరిశీలించి, పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో పిచ్చయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.