'వృద్ధుల కోసం ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేయడం లేదు'
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఐదవ వార్డ్ రేషన్ డీలర్ వృద్ధులకు ఇంటింటికి రేషన్ పంపిణీ చేయట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐదో వార్డులో నివసించే తోలేటి అచ్చియమ్మకి ప్రతినెలా ఇంటికి వచ్చి బియ్యం ఇవ్వడం లేదని ఆమె బంధువులు తెలిపారు. కేవలం బియ్యం అమ్ముకునే వారి వద్ద ఇంటికి రేషన్ డీలర్లు వెళ్లి రేషన్ సరుకులు కోసం థంబ్ వేస్తున్నారన్నారు.