వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా సుదర్శన్
KDP: వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా కలసపాడు మండలానికి చెందిన సగిలి సుదర్శన్‌ను నియమిస్తూ రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చే విధంగా కృషి చేసిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధాకు కృతజ్ఞతలు తెలిపారు.