సాగర్ కాల్వలు పారి 58 వసంతాలు!

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాల్వలకు నీటిని విడుదల చేసి నేటితో 58 ఏళ్లు పూర్తయ్యాయి. కృష్ణానదిపై నిర్మించిన ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు మానవ నిర్మిత ఆనకట్టల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. 1967 ఆగస్టు 4న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి సాగర్‌ను జాతికి అంకితం చేశారు. బీళ్లుగా ఉన్న భూముల్లో సిరులు పండించిన సాగర్ జలాలు చరిత్రలో నిలుస్తున్నాయి.