వందేళ్ల వృద్ధురాలి భౌతికకాయం దానం

KMM: మధిర పట్టణం బంజారా కాలనీకి చెందిన రమావత్ మంగమ్మ(100)సోమవారం మృతి చెందారు.ఈమె మృతదేహాన్ని వైద్య విద్యార్థుల బోధన- అభ్యసన అవసరాల నిమిత్తం ఖమ్మంలోని వైద్య కళాశాలకు అందించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాలర్పించారు. ఈమె జీవితమంతా శ్రీరాముడి భక్తిలో గడిపి, స్థానిక ఆలయానికి ఎంతో సేవ చేశారని పలువురు గుర్తు చేసుకున్నారు.