ముమ్మరంగా చెత్త తొలగింపు పనులు
కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తొలగింపు పనులను ఇవాళ చేపట్టారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామం చుట్టూ వ్యర్థాల నిల్వ తగ్గించి, పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త వాహనాలకు అందజేయాలని గ్రామస్థులకు సూచించారు.