కాణిపాకంలో భక్తులకు తప్పని కష్టాలు.!

TPT: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ఆలయం వద్ద రద్దీ పెరగడంతో వీఐపీ గేట్ వద్ద చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, వికలాంగులు ఎండలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆలయ అధికారులు చర్యలు తీసుకుని త్వరగా దర్శనం అయ్యేలా చేయడంతోపాటు, ఆలయం వెలుపల సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.