VIDEO: సోలార్ విద్యుత్ కనెక్షన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
KKD: సామాన్యులకు సోలార్ విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం గండేపల్లి మండలం మురారిలో ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. SC సామాజిక వర్గానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు మంజూరైన సోలార్ విద్యుత్ కనెక్షన్లను MLA ప్రారంభించారు.