కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకు సర్వం సిద్ధం
TPT: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరగనుంది. ఉదయం సుప్రభాతం, సహస్రనామార్చన అనంతరం తిరుమంజనం ప్రారంభమై ఆలయ గోడలు, పైకప్పులు, పూజాసామగ్రి పవిత్ర జలంతో శుద్ధి చేయబడతాయి. అనంతరం ఉదయం 9:30 నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించబడుతుంది. నవంబర్ 11–25 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది.