VIDEO: సారపాక ప్రధాన రహదారిపై వాహనాలు నిలిపివేసిన అధికారులు

BDK: బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గురువారం ఉదయం 10:30 గంటల నుంచి అధికారులు భారీకేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇటువంటి చర్యలు చేపట్టినట్లుగా తెలియజేశారు.