తారు రోడ్డు నిర్మించాలని వినతి

తారు రోడ్డు నిర్మించాలని వినతి

ASR: కితలంగి గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 25 సంవత్సరాల క్రితం నిర్మించిన తారు రోడ్డు అధ్వానంగా తయారై శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు శుక్రవారం వాపోయారు. అధికారులు ప్రభుత్వం స్పందించి తారు రోడ్డు నిర్మాణం చేపట్టి రవాణా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.