వంతెన నిర్మాణం అసంపూర్తి.. ప్రయాణికుల ఇబ్బందులు

వంతెన నిర్మాణం అసంపూర్తి.. ప్రయాణికుల ఇబ్బందులు

WNP: మదనాపురం-నెల్విడి గ్రామాల మధ్య ఉన్న ఊక చెట్టు వాగుపై రహదారి వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా పాడైపోవడంతో వాహనాలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని వాహనదారులు వాపోయారు. రహదారి మరమ్మతులు తక్షణమే చేపట్టాలని వారు శుక్రవారం అధికారులను కోరుతున్నారు. బస్సులు, పెద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.