VIDEO: 10అడుగుల కొండచిలువ కలకలం
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లిలో గురువారం 10 అడుగుల పొడవైన భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీనిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొందరు యువకులు దానిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తరచుగా ఇలాంటి పెద్ద పాములు వస్తున్నాయని, అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.