VIDEO: 67వ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం
KDP: కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు-తాడిపత్రి రహదారిపై రోడ్డు ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు సోమవారం తాడిపత్రి నుంచి వస్తున్న కారు అదుపుతప్పి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.