'మహిళా ఓట్ల కోసమే ఇందిరమ్మ చీరల పంపిణీ'
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టిందని BRS పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండలంలోని బండరామారంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గత KCR ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు చీర అందించి వారి కండ్లల్లో ఆనందాన్ని నింపారన్నారు.