'అధికారులు సమన్వయంతో పని చేయాలి'
GDWL: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు జోనల్ అధికారులు ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేష్ బాబు అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో జోనల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ నిర్వహణకు మొత్తం 87 మంది జోనల్ అధికారులకు రూట్ల ప్రకారం బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలిపారు.