బాలల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎస్పీ
VZM: బాలల ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అన్నారు. కంటోన్మెంట్‌లోని పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనతరం ఆయన మాట్లాడుతూ.. నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళిన పిల్లలను కలుస్తూ, వారితో ముచ్చటించే వారన్నారు.