కేసుల దర్యాప్తునకు AI టెక్నాలజీ: సజ్జనార్
TG: HYDలోని DCPలు, ఏసీపీ, సీఐలతో సీపీ సజ్జనార్ సమావేశం నిర్వహించారు. బేసిక్ పోలీసింగ్‌ను మర్చిపోవద్దని వారికి సూచించారు. విధి నిర్వహణలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు. కేసుల దర్యాప్తు కోసం త్వరలో AI టెక్నాలజీని తీసుకొస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ-దర్యాప్తు తదితర అంశాలను అధికారులకు వివరించారు.